రాజమండ్రిలోని ఎఫ్‌సీఐ గోదాంలో 2024 ఎన్నికల కోసం భద్రపరిచిన ఈవీఎంలను జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి మంగళవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మార్గదర్శకాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. గోదాంలో ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ప్రమాణాలను సమీక్షించారు.