మన బాధ్యత ఫౌండేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుని నియామకం

మన బాధ్యత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు గారా అజయ్ కుమార్ ఆదివారం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా ఒల్లిపిల్లి శివ శంకర్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా శివ శంకర్ మాట్లాడుతూ, ఫౌండేషన్ ప్రారంభం నుండి సభ్యుడిగా ఉన్నానని, ఇప్పుడు తీసుకున్న బాధ్యతలకు అనుగుణంగా విశాఖపట్నంలో ఫౌండేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ నియామకాన్ని పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్