క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లకు ఎస్పీ హెచ్చరిక

ఐపీఎల్ మ్యాచ్‌ల పేరుతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ సోమవారం హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో యువతను లక్ష్యంగా చేసుకునే వారిపై నిఘా ఉంచామని, బెట్టింగ్‌ నిర్వాహకుల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112కు తెలపాలని ఆయన కోరారు. నిర్వాహకులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్