ఈనెల 10న తూ. గో జిల్లాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈనెల 10వ తేదీ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి రాజమండ్రిలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం నన్నయ్య యూనివర్సిటీలో జరిగే XVI & XVII సంయుక్త కన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్