తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 9వ అదనపు జిల్లా జడ్జి జి. షణ్ముఖ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యార్లగడ్డ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ప్యానల్ న్యాయవాదులతో జరిగిన ఈ సమీక్షలో, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.