SIR కార్యక్రమానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR) పై సమీక్షించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపట్టిక ప్రకారం ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్