డీఆర్వో టి. సీతారామ మూర్తి సేవలు అభినందనీయం

తూ. గో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి గత ఏడాదిన్నర కాలంగా జిల్లా పరిపాలనలో అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వయోపరిమితి కారణంగా పదవీ విరమణ పొందుతున్న డీఆర్వోని మంత్రి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు. జిల్లా పరిపాలనలో డీఆర్వో సీతారామమూర్తి అంకితభావంతో విధులు నిర్వహించారని, ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతూ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారని మంత్రి ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్