తాళ్లపూడి మండలం బల్లిపాడులోని కాకర్ల కళ్యాణం మండపంలో బుధవారం హైబ్రిడ్ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన వంటవాళ్లతో వండించిన వంటకాలను వందలాది మంది అతిథులకు వడ్డించారు. మహానాడు అంటేనే విందు భోజనానికి చిరునామా అనిపించేలా ఆతిథ్యం అందించారు.