ఫిట్‌నెస్ లేని వాహనాలపై చర్యలు

తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్ & కాలేజీ బస్సులపై ప్రత్యేక తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ బుధవారం తెలిపారు. మే 1వ తేదీ నుంచి కొనసాగుతున్న ఈ తనిఖీల్లో ఇప్పటివరకు 108 బస్సులను పరిశీలించారు. జిల్లాలో మొత్తం 1705 స్కూల్ బస్సులు ఉండగా, వాటిలో 1318 బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాయి. మిగిలిన 387 బస్సులు ఫిట్‌నెస్ లేనివిగా గుర్తించబడ్డాయి.

సంబంధిత పోస్ట్