రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదివారం మోరంపూడి జంక్షన్ వద్ద మహాలక్ష్మి మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ మార్కెట్ రాజమండ్రికి మరో మణిహారంగా మారుతుందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా నిర్మాణం జరుగుతోందని తెలిపారు. సుమారు 400 షాపులతో అన్ని రకాల వ్యాపార సంస్థలతో ఇది అతి పెద్ద మార్కెట్ గా అవతరించబోతుందని ఆయన పేర్కొన్నారు.