గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణకు సన్నద్ధమవుతున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు, రాజమండ్రిలోని పుష్కరాల రేవు వద్ద బుధవారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత, నిఘా వంటి అంశాలపై డీఎస్పీలు క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ఆదేశాల మేరకు ఘాట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతర భద్రతా చర్యలపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు.