రాజమండ్రి నగరంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన భవన యజమానులకు నగరపాలక సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం కల్పించిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బి పి ఎస్ -2025) అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. లేనియెడల చట్ట ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపింది. గురువారం ఉదయం మోరంపూడి జంక్షన్ వద్ద ఒక అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడం జరిగింది. నగర శ్రేయస్సు, ప్రజల భద్రత, ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధికి విఘాతం కలిగించే నిర్మాణాలపై కార్పొరేషన్ కఠిన చర్యలు తీసుకోనుంది.