రాజమండ్రి రూరల్ మండలం సాటిలైట్ సిటీ ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ITDP నియోజకవర్గ అధ్యక్షులు శ్రీను, గ్రామ కమిటీ అధ్యక్షులు నిచ్చినకోళ్ల సత్తిబాబు తెలిపారు. సోమవారం, సాటిలైట్ సి బ్లాక్ నుండి గణేష్ సెంటర్ వరకు రూ. 3.5 కోట్లతో జరుగుతున్న రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని వారు అధికారులను కోరారు.