రాజానగరం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని వెంటనే బంధించి, పులి దాడిలో నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం రాజమండ్రి రూరల్ వైసీపీ కార్యాలయం వద్ద మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు.