హిట్ & రన్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించే విషయంలో గౌరవ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత స్పష్టం చేశారు. శుక్రవారం తూ. గో జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూ. గో జిల్లా వ్యాప్తంగా మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు.