శుక్రవారం మధురపూడి విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ కలిశారు. ఈ సందర్భంగా వారు ఏపీఐఐసీ ప్రగతిని మంత్రికి వివరించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని వారు కోరారు. దీనిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు.