నీటిమునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఆర్డీఓ

రాజమండ్రి ఆర్డీఓ ఆర్. కృష్ణ నాయక్ గురువారం సాయంత్రం కొరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం గ్రామాన్ని సందర్శించారు. అచ్యుతాపురం వద్ద చెరువు గండి కొట్టడం వలన నీరు పొంగి ప్రవహించిన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ముంపు ఘటనలు చోటు చేసుకోకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీరంగపట్నం గ్రామంలో బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్