అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవన్ నందు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం యధావిధిగా ఉంటుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరించనున్నట్టు తెలిపారు. స్థానిక కలెక్టరేట్, డివిజన్, పురపాలక సంఘాలు, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.