వెల్లసావరం కల్వర్టు వద్ద పొంచి ఉన్న ప్రమాదం

రామచంద్రపురం మండలం వెల్లసావరం నుంచి గొల్లలచెరువు, కందులపాలెం వెళ్లే రహదారిలోని కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. రక్షణగోడలు కూలిపోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి, తక్షణమే కల్వర్టుకు రక్షణగోడలు నిర్మించి ముప్పును తప్పించాలని స్థానికులు బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్