పారదర్శకంగా పాసు పుస్తకాల పంపిణీ: కోనసీమ కలెక్టర్

అంబాజీపేట మండలం మొసలపల్లిలో బుధవారం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు. ఈ-కేవైసీ, ఆధార్ వివరాలు సరిపోలితేనే రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించి రైతులకు అందజేయాలని సూచించారు. అలాగే, సుపరిపాలన లక్ష్యంగా చేపట్టిన 'యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే' ద్వారా జూన్ నాటికి ప్రతి కుటుంబానికి క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్