అల్లూరి: అధికారులతో మంత్రి సమీక్షిస్తారు

స్వరాంధ్ర విజన్ 2047 కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 11న మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. అధికారులు జిల్లా విజన్ కార్యచరణ ప్రణాళికపై సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. వ్యవసాయం, ఉద్యాన, పర్యాటకం తదితర శాఖలపై మంత్రి సమీక్షిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్