దేవీపట్నం మండలంలో గోదావరిలో వరద పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో పర్యాటక బోట్ లు తాత్కాలికంగా నిలిపివేశామని టూరిజం అధికారులు ఆదివారం తెలిపారు. పాపికొండల విహారయాత్ర కూడా ఈ నేపథ్యంలో నిలిపినట్లు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. వరద తగ్గే వరకు బోట్లు నదిలో తిరగవని స్పష్టం చేశారు.