ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన ద్వారా రైతులు ప్రయోజనం పొందాలని రాజవొమ్మంగి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చక్రధర్ సోమవారం తెలిపారు. రూ.638 ప్రీమియంతో రూ.42,000 వరకు భీమా లభిస్తుందన్నారు. ఆధార్, భూమి పాస్‌బుక్, సాగు విస్తీర్ణ సర్టిఫికెట్, బ్యాంక్ ఖాతా, ఫోన్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని రైతులను కోరారు.