రాజవొమ్మంగి సిడిపిఓ గా సుజాత

రాజవొమ్మంగి ఐసిడిఎస్ సిడిపిఓ గా బి సుజాత శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. సుజాత విశాఖపట్నం పెందుర్తి ఐసిడిఎస్ కార్యాలయంలో గ్రేడ్ 1 సూపర్వైజర్ గా పనిచేసి పదోన్నతి పై స్థానిక ఐసిడిఎస్ సిడిపిఓ గా శుక్రవారం విధుల్లో చేరారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన సిడిపిఓ దేవమణి కొయ్యూరు బదిలీపై వెళ్లారు. శుక్రవారం విధుల్లో చేరిన సిడిపిఓ సుజాతను కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్