ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్ ర్యాలీ: ప్రమాదాల నివారణకు సూచనలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ సెంటర్ వద్ద ఆదివారం సీఐ గౌరీశంకర్, ఎస్ఐ చినబాబు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులతో కలిసి హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ గౌరీశంకర్ మాట్లాడుతూ, ప్రమాదాల నివారణలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా, పశువుల వల్ల జరిగే ప్రమాదాల సమయంలోనూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. ఈ ర్యాలీలో పోలీసులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్