హనుమాన్ జంక్షన్ ఎస్ఐ వెలుగుల సురేష్ కు గణతంత్ర దినోత్సవ పురస్కారం

హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ వెలుగుల సురేష్ తన విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జిల్లా కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ జంక్షన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఎస్ఐ సురేష్ ను ఘనంగా సత్కరించారు. ఆర్యవైశ్య నాయకులు పైడి సుధాకర్, కొనకళ్ళ రాజశేఖర్ మాట్లాడుతూ, సురేష్ మంచి పేరు తెచ్చుకున్నారని, అందుకే ప్రభుత్వం ఆయనను గుర్తించిందని తెలిపారు. సంఘం సభ్యులు పోలీస్ స్టేషన్ కు వచ్చి జ్ఞాపికను అందజేశారు.

సంబంధిత పోస్ట్