కాకినాడలో కోరమాండల్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి లోకేష్

కాకినాడ రూరల్ వలసపాకల బీచ్ రోడ్డులో కోరమాండల్ ఆసుపత్రి నూతన భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 60 పడకల ఇంటిగ్రేటెడ్ కోరమాండల్ హాస్పటల్ నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద కోరమాండల్ సంస్థ గత కొన్నేళ్లుగా అవుట్ పేషంట్ హాస్పిటల్ ను నిర్వహిస్తోంది. మొదటి దశలో ఆసుపత్రి అభివృద్ధికి రూ.8 కోట్లు, రెండో దశలో రూ.32 కోట్లు వెచ్చించి ఇన్ పేషంట్ సదుపాయాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్