తుని రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద రూ. 19.13 కోట్లతో ఆధునీకరణ పనులు పూర్తి చేసుకుంది. మొదటి దశలో ఎయిర్‌పోర్ట్ తరహా వెయిటింగ్ హాల్స్, తాగునీరు, అత్యాధునిక టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మరో రూ. 23 కోట్లతో రెండో దశ పనులు కూడా త్వరలోనే పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే స్టేషన్ మరింత హైటెక్‌గా మారనుంది.