తలుపులమ్మ లోవలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

ప్రముఖ పుణ్య క్షేత్రం తలుపులమ్మ దేవస్థానంలో ప్రసాద తయారీ తీరును ఆహార భద్రత శాఖ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందాజీ ఆధ్వర్యంలో లడ్డూ, పులిహోర ప్రసాద తయారీ విధానాన్ని పరిశీలించారు. ప్రసాదంలో ఉపయోగిస్తున్న పదార్థాల నాణ్యత, శుభ్రతా ప్రమాణాలు, వంటగది నిర్వహణ విధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్