తిమ్మరాజుపేటలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం

కోటనందూరు మండలం తిమ్మరాజుపేట గ్రామంలో బుధవారం పోలీసులు నిర్వహించిన 'పల్లె నిద్ర' కార్యక్రమానికి గ్రామస్థులు విశేషంగా స్పందించారు. ఎస్సై టి. రామకృష్ణ ప్రజలతో సమావేశమై మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తత, గృహహింస నియంత్రణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవలను వినియోగించాలని సూచించారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్న పోలీసులు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్