తుని రూరల్ ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు సీఐ చెన్నకేశవ తెలిపారు. ఆదివారం లోవతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామని చెప్పారు. లోవకు వచ్చే భక్తులు పేకాట, గుండాట వంటి జూదాలకు దూరంగా ఉండాలని సూచించారు.