APPSC గ్రూప్-1 కేసుపై ఈడీ తనిఖీలు

ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం ఏడు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఆరు చోట్ల, గుంటూరులో ఒక చోట తనిఖీలు జరిగాయి. 2020లో జరిగిన మెయిన్స్ పరీక్షలో, అర్హత లేని 66 మందితో ఆన్సర్ షీట్ల మూల్యాంకనం చేయించారని సిట్ (SIT) గతంలోనే ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕