ఏపీలో నేడు విద్యాసంస్థల బంద్!

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యారంగ సమస్యల పరిష్కారం డిమాండ్‌తో ఏబీవీపీ సహా పలు విద్యార్థి సంఘాలు ఆగస్టు 5న రాష్ట్రంలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే ఈ బంద్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు అధికారికంగా ఎలాంటి సెలవు ప్రకటించలేదు. బంద్ ప్రభావం దృష్ట్యా విద్యాసంస్థల నిర్వహణపై ఆయా యాజమాన్యాలే స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నాయి. విద్యార్థులు తమ విద్యాసంస్థల నుండి అధికారిక సమాచారం తెలుసుకుని రావాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్