ఏపీలో దశలవారీగా విద్యుత్ బస్సులు

AP: రాష్ట్రంలో జులై నుంచి కొత్త విద్యుత్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీ ప్రభుత్వం దశలవారీగా 5,500 ఎలక్ట్రిక్ బస్సులు, 500 సీఎన్‌జీ బస్సులను తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఉన్న పాత బస్సుల స్థానంలో ఈ కొత్త బస్సులు రానున్నాయి. ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద కేంద్రం కేటాయించిన 750 బస్సుల్లో 300 బస్సులు జులైలో, మిగిలిన 450 బస్సులు ఆగస్టులో అందుబాటులోకి వస్తాయి. ఈ బస్సులు విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, అమరావతి, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం వంటి 11 నగరాలకు కేటాయించబడతాయి.

సంబంధిత పోస్ట్