AP: ఆక్వాలో కొత్తగా 12,680 కనెక్షన్లకు విద్యుత్తు రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ప్రభుత్వంపై అదనంగా రూ.188 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే 50 వేల కనెక్షన్లకు విద్యుత్ రాయితీ అమలవుతోంది. దాంతో మొత్తంగా ప్రభుత్వం రూ.1,100 కోట్లు భరించనుంది. అలాగే రాష్ట్రంలో ఆక్వా సాగయ్యే 4 లక్షల ఎకరాల్ని జోన్ పరిధిలోకి తీసుకురానుంది. కొత్త రైతుబజార్లతో పాటు ఇప్పటికే ఉన్న రైతుబజార్లను ఆధునికీకరించి, డిజి యాప్‌ను విస్తృతం చేయనుంది.