ముదినేపల్లి : షష్ఠి ఉత్సవాలకు సహకరించాలి

ముదినేపల్లి మండలం సింగరాయపాలెం- చేవూరు పాలెం సెంటరులోని వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల 7 నుంచి 13 రోజుల పాటు జరిగే షష్ఠి కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లపై రెండు గ్రామాల ప్రజలు పూర్తి సహకారం అందించి విజయవంతం చేయాలని గుడివాడ డివిజన్ ఆలయాల తనిఖీ అధికారి సుధాకర్ కోరారు.
ఆలయంలో శనివారం ఇరు గ్రామాల పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్