వాహన ప్రమాదాల నివారణ, మితిమీరిన వేగంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు కొయ్యలగూడెం పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై గురువారం 'యాక్సిడెంట్ డెమో' కేంద్రాలను ఏర్పాటు చేశారు. అచ్చుతాపురం, పులివాగు, బయ్యన్నగూడెం గ్రామాల్లో వీటిని నెలకొల్పినట్లు ఎస్సై వర్రె చంద్రశేఖర్ తెలిపారు. ఈ కేంద్రాలలో ప్రమాదాల్లో పూర్తిగా ధ్వంసమైన వాహనాలను ప్రదర్శనగా ఉంచి అవగాహన కల్పిస్తున్నారు.