తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్ షెడ్ సమీపంలో గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 13.288 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్ తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెం పట్టణ పోలీసు స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. గంజాయి నియంత్రణకు 'ఈగల్' అనే సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు.