తణుకు పట్టణంలో గల ఉమెన్స్ కాలేజీ వద్ద యువజన సర్వీసు శాఖ పశ్చిమగోదావరి జిల్లా ఆధ్వర్యంలో శనివారం యువజన సంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ హాజరయ్యారు. యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఎటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. కాలేజీ యజమాన్యం ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు.