ఉపాధి హామీ కొత్త కార్డుల జారీలో కీలక మార్పులు.. ఫేస్ రికగ్నేషన్ అమలు

ఏపీలో ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త కార్డుల జారీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇకపై కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న 48 రోజుల్లోనే జాబ్ కార్డ్ తప్పనిసరిగా అందించాలని నిబంధనలు ప్రవేశపెట్టారు. లబ్ధిదారులు దరఖాస్తు ఫారం సమర్పించి, ఈకేవైసీ ప్రక్రియ అనంతరం కార్డును ఉచితంగా పొందవచ్చు. అలాగే, పనికి హాజరయ్యే లబ్ధిదారుల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కొన్నిచోట్ల అమల్లో ఉన్న ఈ విధానం మార్చి తర్వాత పూర్తి స్థాయిలో అమలు కానుంది.

సంబంధిత పోస్ట్