AP: విద్యార్థుల సంక్షేమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపునకు రూ.251.30 కోట్లు విడుదల చేసింది. అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల బకాయిల కోసం రూ.534.63 కోట్లు మంజూరు చేసింది. మైనారిటీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల బకాయిలకు రూ.47.80 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు రూ.171.13 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలపై విద్యార్థులు ఆనందంలో ఉన్నారు.