AP: సంక్షేమ హాస్టళ్లలో వసతులు, పర్యవేక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల సరైన తాగునీరు, ఇతర సౌకర్యాలు లేక విద్యార్థులు అనారోగ్యం పాలవడంతో CM చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై ఆయన పలు సూచనలు చేశారు. 20 శాతం హాస్టళ్లలో టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.40 కోట్లు విడుదల చేస్తామని, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.