నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. ఏడుగురు నిందితులకు బెయిల్

AP: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 33 మంది నిందితులు ఉండగా వారిలో ఏడుగురు నిందితులకు తంబళ్లపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తుకు సహకరించడం, సాక్ష్యాలను ప్రభావితం చేయకపోవడం వంటి షరతులు విధించింది. కాగా ఈ వ్యవహారంలో పలు రాష్ట్రాలకు లింకులు ఉన్నాయని, సిట్ తరహా లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బెయిల్ మంజూరు అయినప్పటికీ, దర్యాప్తు కొనసాగుతుందని, ఇతర నిందితుల పాత్ర, సరఫరా నెట్‌వర్క్‌పై విచారణ జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్