తిరుమలలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్.. టీటీడీ కీలక నిర్ణయం

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ఆహార భద్రత, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా తిరుమలలోని 325 షాపుల్లో పనిచేసే 1,300 మంది సిబ్బందికి ఆహార భద్రత, పరిశుభ్రతలపై మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకటయ్య చౌదరి మాట్లాడుతూ, భక్తులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం టీటీడీ బాధ్యత అని, ఆహార తయారీ, నిల్వ, పంపిణీ ప్రక్రియల్లో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్