AP: మరణించిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాదాపు 1,150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయానికి నిధులు విడుదల చేసింది. రూ.46 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరణించిన న్యాయవాది కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. బాధిత న్యాయవాదికి సంబంధించి నామినీకి ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.