AP: జులై 8 నుంచి విశాఖపట్నం విమాన ప్రయాణంలో కొత్త శకం ప్రారంభం కానుంది. విమాన సంస్థలు తమ కార్యకలాపాలను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మార్చనున్నాయి. దీంతో పాత నేవీ బేస్‌లో పౌర విమానాల రాకపోకలు నిలిచిపోతాయి. డొమెస్టిక్ విమానాల షెడ్యూల్స్‌లో మార్పులు ఉన్నందున ప్రయాణికులు తమ టికెట్లను సరిచూసుకోవాలని సూచించారు. స్కూట్ ఎయిర్‌లైన్స్ జులై 25 నుంచి భోగాపురం నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. కొత్త కోడ్‌ల కోసం ప్రయాణికులు తమ పీఎన్ఆర్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి.