వరద సాయం.. ఒక్కో ఫ్యామిలీకి రూ.3,000

ఏపీలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.16 కోట్లను 12 జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసింది. బాధితుల్లో ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున, కుటుంబానికి గరిష్ఠంగా రూ.3,000 అందించాలని ఆదేశించింది. అలాగే 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లి, బంగాళాదుంపలు, పంచదార, లీటర్‌ పామాయిల్‌ అందించనుంది. మత్స్యకారులకు 50 కిలోల బియ్యం ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕