పొదుపు సంఘాల మహిళలకు ఉచితంగా ఎగ్‌కార్ట్‌లు

AP: స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు మెప్మా ఆధ్వర్యంలో గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు, తెనాలి, పొన్నూరు పురపాలక సంఘాల పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు ఉచితంగా ఎగ్‌కార్ట్‌లు అందించనున్నారు. మొత్తం 200 మంది మహిళలను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.50 వేల విలువైన ఎగ్‌కార్ట్‌తో పాటు కోడిగుడ్లు, ఆహార ఉత్పత్తుల తయారీ పరికరాలు అందజేస్తారు. వ్యాపార నిర్వహణ, గుడ్లతో ఆహార పదార్థాల తయారీపై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఆగస్టు 15లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్