పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా భోజనం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా, అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు సెలవు రోజుల్లో కూడా శిక్షణ అందిస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బంది పడకుండా, సెలవు దినాల్లో కూడా వారికి పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం అన్ని ఉన్నత పాఠశాలల్లో అమల్లోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్