ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ విద్యుత్ పథకం

ఏపీలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూటమి ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్టీ బిజిలీ యోజన పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సబ్సిడీతో పాటు మిగిలిన వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నెల్లూరు జిల్లాలోని రామచంద్రపురం గ్రామంలో తొలి ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఎస్సీ/ఎస్టీ వినియోగదారుని ఇంటి వద్ద సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.

సంబంధిత పోస్ట్